Sajjala Bhargav: సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..! 20 d ago
వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును సజ్జల భార్గవరెడ్డి ఆశ్రయించారు. ఇకపై తనపై కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీ హైకోర్టును ఆశ్రయించేందుకు రెండు వారాల గడువునిచ్చింది.